![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-77 లో.. కేశవ, కన్నా, మాధవ రాత్రి పడుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి చక్రి వస్తాడు. చక్రి ఏడుస్తుంటే ఏంట్రా ఈ కన్నీళ్ళు తూడ్చుకోమని మాధవ అంటాడు. మహాకి నేను ఇష్టం లేదు.. ఆ పెళ్ళి తప్పించుకోవడానికే తను నన్ను పెళ్ళి చేసుకుంది కానీ నేను తనని ఇష్టపడ్డాను.. నేనేం ప్లాన్ చేయలేదని చక్రి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. వాళ్ళంతా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం మహా లేచి ఊడవడానికి బయటకు వస్తుంది.
కానీ అక్కడ మాధవ వాళ్ళ నాన్న నారాయణ ఉంటాడు. వద్దు అమ్మా మా వాకిలి మేము ఊడ్చుకుంటామని నారాయణ అనగానే పర్లేదు నేను ఊడుస్తా అని మహా అంటుంది. ఇప్పుడు ఊడుస్తావ్.. తర్వాత మా పనులు మేమే చూసుకోవాలి కదా అని చీపురు ఇవ్వమని నారాయణ అనగానే మాహా ఇస్తుంది. ఆ తర్వాత అందరు పడుకొని ఉంటే మహా వెళ్ళి ఫోన్ లో సుప్రభాతం పెడుతుంది. దాంతో మాధవ, చక్రి, కన్నా, కేశవ అందరు నిద్రలేస్తారు. కాసేపటికి అందరు ఫ్రెష్ అవుతారు. మహా కొత్తగా రెడీ అయి వస్తుంది. మాధవ, చక్రి, కేశవ, కన్నాలతో మహా మాట్లాడుతుంది. నేనొక విషయం చెప్పాలి పెద్ది అని మహా అనగానే వద్దు అమ్మ.. నువ్వు నన్ను అలా పిలవొద్దు.. అలా పిలిచిన ప్రతీసారీ ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉందని మధవ అంటాడు. నేను అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందని మీ అందరితో చెప్పాక నా భారం దిగిపోయింది అని మహా అంటుంది.
వదిన మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్దామని అనుకుంటున్నారు. వాళ్ళు గొడవపడుతున్నారని ఆ.. లేక మా నాన్న తాగుతాడని ఆ.. లేక మేము బాగా చేసుకోలేదా అని కన్నా ఎమోషనల్ అవుతాడు. వదిన మిమ్మల్ని చూసి భయడపటం.. మీకు నచ్చేలా ఉండటమే నాకు తెలుసు.. కానీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని కేశవ అంటాడు.
మీరందరు ఎందుకు అలా మట్లాడుతున్నారు.. నేను మరీ అంత స్వార్థపరురాలినా అని మహా అంటుంది. అమ్మా మహా.. నీకు జాబ్ వచ్చేంతవరకు ఇక్కడే ఉండు.. అయినా మీ వదిన చెప్పినట్టు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకు.. నీకు నచ్చినట్టు ఇక్కడే ఉండు.. అసలు నీకు భయం లేదమ్మా.. మీ అమ్మానాన్న నిన్ను గారాబం చేసి మొండిదానిలా పెంచారు.. చెప్తే వినాలి.. ఒక్కదానివే సిటిలోకి వెళ్ళి ఉంటవా.. ఏ మేం లేమా అని.. మమ్మల్ని పరాయివాళ్ళని చేసి వెళ్ళిపోతావా అని మాధవ అంటాడు. మహా ఏదో చెప్పబోతుంటే మాధవ ఆపుతాడు . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |